మా దేశం సేఫ్.. భారతీయులు వచ్చి పర్యటించండి : ఇరాన్

-

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌‌లో పర్యాటక రంగం బాగా తగ్గిపోయింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఎప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయో అని ఇరుగుపొరుగు దేశాలు సైతం భయాందోళనకు గురవుతున్నాయి. ఇప్పటికే పాలస్తీనా ఇజ్రాయిల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు హమాస్ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారు. పాలస్తీనా కేంద్రంగా వారు ఇజ్రాయెల్ మీద ఎదురుదాడికి దిగుతున్నారు.

ఇప్పటికే పాలస్తీనా, గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ దాడుల కారణంగా నగరాలు మొత్తం సర్వనాశనం అయ్యాయి.ఎక్కడ చూసినా కూలిపోయిన భవనాలు, ధ్వంసమైన శిథిలాలే దర్వనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ దేశానికి రావాలంటూ భారత్‌లో ఉంటున్న ఇరాన్ రాయబరి ఇరాజ్ ఇలాహీ భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ‘ఇజ్రాయెల్‌కు ఇరాన్‌కు మధ్య ఉద్రిక్తతలు ఎప్పటినుంచో ఉన్నావే. మా దేశం చాలా సురక్షితం. భారత మిత్రులు వచ్చి పర్యటించండి’ అని కోరారు. ప్రస్తుతం ఇరుదేశాలకు మధ్య విమానాలు మాత్రమే నేరుగా నడుస్తుండగా.. అవి మరింతగా పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version