మా డిమాండ్ నెరవేరింది – విజయసాయిరెడ్డి

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు సికింద్రాబాద్ – తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే వందే భారత్ రైలుని ప్రారంభించడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ రైలుని ప్రారంభించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు విజయసాయిరెడ్డి.

ysrcp mp vijayasai reddy

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ ఈరోజు నెరవేరిందని, ఈ రైలు అంశాన్ని వైసీపీ ఎంపీలు పార్లమెంటులో చాలా రోజులుగా ప్రస్తావిస్తూన్నారని వివరించారు. తిరుపతి యాత్రికులకు ఈ వందే భారత్ రైలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇది ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడే అంశం అని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version