మహాత్మా జ్యతిరావు ఫూలే వర్థంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ముందుగా ఫూలే చిత్రపటానికి ఘన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి ఆయన చూపిన బాట అనుసరణీయమని కొనియాడారు. అదే స్ఫూర్తితో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ట్వీట్ చేశారు.

ఇదిలాఉండగా, ఏపీ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. సంక్షేమ పథకాలు, విద్య, వైద్యంలో బలహీన వర్గాల వారికి పెద్దపీట వేస్తున్నారు.అంతేకాకుండా రాజకీయాల్లోనూ తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.