అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నట్లుగా సభా సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ కు ధన్యవాద తీర్మానం కోసం సభను నేడు హాజరు పర్చగా.. టాపిక్ కాస్త డైవర్ట్ అయ్యి అధికార, ప్రతిపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
అయితే, బీఆర్ఎస్ పార్టీ తరఫున నేడు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులకు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న రన్నింగ్ కామెంటరీకి ఆయన తగిన బదులిస్తున్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఫార్మ్ హౌస్లో ఉన్నాడా? అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలకు ‘ఢిల్లీలో ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే మా నాయకుడు దగ్గరలోనే ఉన్నాడు’ అంటూ జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ ఫార్మ్ హౌస్లో ఉన్నాడా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
ఢిల్లీలో ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే దగ్గరలోనే ఉన్నాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి pic.twitter.com/b94hWPUCPi
— Telugu Scribe (@TeluguScribe) March 13, 2025