తెలంగాణ పరిధిలోని సాగర్ డ్యాంను ఏపీకి చెందిన బలగాలు స్వాధీనం చేసుకోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ విషయంపై తాజాగా మాజీమంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పందిస్తూ సీఎం రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
‘తెలంగాణ నీళ్ళు ఆంధ్రాకు..తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలించడమే రేవంత్ రెడ్డి కర్తవ్యం’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాగార్జున సాగర్‌ను ఆక్రమించుకున్నా రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు. చంద్రబాబు ద్వారా మోడీ మెప్పు పొందడానికి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు’ అని మాజీ మంత్రి ముఖ్యమంత్రి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.