ఔటర్ రింగ్ రోడ్ పై పోలీసుల కఠిన చర్యలు, ప్రత్యేక కథనం…!

-

ప్రతీ నెలా ఔటర్ రింగ్ రోడ్ పై ఏదోక ఘోరం జరుగుతూనే ఉంది. మితిమీరిన వేగంతో ఎందరో వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. కార్లు, లారీలు ఇలా మితిమీరిన వేగంగా వెళ్తూ ప్రమాదాలకు గురవుతున్నాయి. దీనితో తెలంగాణా పోలీసులు ఇప్పుడు కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు. స్పీడ్ గన్స్ తో వెంటాడుతున్నారు. స్పీడ్ గా వెళ్తే చాలు చుక్కలు చూపిస్తున్నారు అధికారులు.

రాష్ట్రంలో ఇప్పటి వరకు, 8 లక్షల 96వేల 92 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు కాగా అత్యధిక భాగం ఒక్క ఔటర్ రింగ్ రోడ్ మీదే ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పై పోలీసులు ఇప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఔటర్ పై స్పీడ్ ని వంద కిలోమీటర్లు గా అధికారులు నిర్ధారించారు. రోజుకి 2986 ఓవర్ స్పీడ్ కేసులు నమోదు అవుతున్నాయి.

హైదరాబాద్ పరిధిలో ఆరు స్పీడ్ గన్స్ ఉండగా సైబరాబాద్ పరిధిలో 11 స్పీడ్ గన్స్ ఉన్నాయి. రాచకొండ కమీషనరేట్ పరిధిలో 8 స్పీడ్ గన్స్ ఉన్నాయి. దీనితో చలానాలు భారీగా వసూలు చేస్తున్నారు. అక్టోబర్ 31 న ఒక్క రోజే 3614 కేసులు నమోదు అయ్యాయి అంటే పోలీసులు ఏ స్థాయిలో సీరియస్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 68 కోట్లకు పైగా వసూలు చేసారు అధికారులు.

స్పీడ్ రైడింగ్ తో ప్రమాదాలు ఎక్కువగా అవ్వడంతో పోలీసులు చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ 150 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ ఉండగా విశాలంగా ఉండటంతో ఇష్టం వచ్చినట్టు వాహనాలు నడుపుతున్నారు. దీనితో పోలీసులు ఉపేక్షించడం లేదు. వాళ్ళ జీవితంతో పాటుగా పక్క వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నారు కొందరు. దీనితో ఏ మాత్రం సహించవద్దని రవాణా శాఖ భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version