భారత్‌లో పాక్ ఐఎస్ఐ కుట్ర.. ఏం ప్లాన్ చేసిందో తెలుసా..?

-

భారతదేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతోంది. రైల్వే ట్రాకులు లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తోందని నిఘా వర్గాలు హెచ్చరించారు. ఈ మేరకు పంజాబ్, ఇతర రాష్ట్రాల్లోని రైల్వే ట్రాకులు పేల్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి గానూ ఐఎస్ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్ కు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నట్లు సమాచారం.

రైల్వే ట్రాకులు – తనిఖీలు

అలాగే ఖలిస్తాన్ ఉగ్రవాదులను కూడా ఐఎస్ఐ దాడులకు ఉసిగొల్పుతోందని నిఘా వర్గాలు వెల్లడించాయి. పంజాబ్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఐఎస్ఐ ప్లాన్ చేస్తోందన్నారు. కాగా, ఇటీవల దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాద సంస్థలు పన్నాగం పన్నాయి. కానీ విఫలం అయ్యాయి. పాకిస్తాన్ నుంచి డ్రోన్ సహాయంతో ఆయుధాలు వచ్చినట్లు నిందితులు విచారణలో తెలిపారు. నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రైల్వే ట్రాకుల వద్ద వెంటనే భద్రత కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, రాజస్థాన్, హరియాణాలోని రైలు మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version