ASIA CUP SUPER 4: బంగ్లాదేశ్ అల్ అవుట్ @193

-

ఆసియా కప్ లో లీగ్ మ్యాచ్ లు ముగిసిపోయాయి.. మొత్తం ఆరు జట్లతో స్టార్ట్ అయిన టోర్నమెంట్ కాస్తా నాలుగు జట్లకు తగ్గిపోయింది. ఇండియా, శ్రీలంక , పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లు సూపర్ 4 కు చేరుకోగా, నేపాల్ మరియు ఆఫ్గనిస్తాన్ లు ఇంటి దారి పట్టాయి. కాగా ఈ రోజు లాహోర్ వేదికగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన సూపర్ 4 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హాసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ ఎందుకో బంగ్లాకు కలిసి రాలేదు. గత మ్యాచ్ లో సెంచరీ చేసిన మెహిదీ హాసన్ మిరాజ్ డక్ అవుట్ గా వెనుతిరగగా, ఈ రోజు జట్టులోకి వచ్చిన లిటన్ దాస్ నిలకడగా ఆడలేక చేతులెత్తేశాడు. ఒక దశలో బంగ్లాదేశ్ కేవలం 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో క్రీజులోకి వచ్చిన సీనియర్ ఆటగాడు రహీం షకిబుల్ హాసన్ తో కలిసి నాలుగవ వికెట్ కు సరిగ్గా 100 పరుగులు జోడించారు.

అనంతరం ఏ ఒక్కరూ కూడా క్రీజులో నిలబడలేక మిగిలిన అయిదు వికెట్లు కేవలం పరుగులు మాత్రమే జత చేసి 193 పరుగుల వద్ద ఉండగా ఆల్ అవుట్ అయింది. ఇక పాకిస్తాన్ బౌలర్లలో హరీష్ రాఫ్ 4 మరియు నసీం షా 3 వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version