జమ్ముకాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో నిన్న రాత్రి పాక్ డ్రోన్ దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో రాజౌరీ అడిషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజ్ కుమార్ సైతం ఉన్నట్లు సమాచారం.
దీంతో ఆయన్ను వెంటనే రాజౌరిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, చికిత్స పొందుతూ ఆయన శనివారం ఉదయం కన్నుమూసినట్లు సమాచారం. ఇదిలాఉండగా, డ్రోన్ దాడుల్లో ఓ వ్యక్తికి తీవ్రగాయాలతో పాటు రక్తస్రావం జరిగింది.దీనికి సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా,పాక్ డ్రోన్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.