పాక్ ప్రధానిగా అవిశ్వాసం ఎదుర్కొని పదవి కోల్పోయాడు ఇమ్రాన్ ఖాన్. ఐదేళ్లు పదవీ కాలంలో ఉండాలనుకున్న అతని కలకు అవిశ్వాసం బ్రేకులు వేసింది. నిన్న అర్థరాత్రి జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీలో జరిగిన అవిశ్వాస తీర్మాణంలో పాక్ ప్రధానిగా ఇమ్రాన్ మద్దతు కోల్పోయారు. ఫలితంగా ప్రధాని పదవి నుంచి గద్దె దిగారు. రేపు పాక్ కొత్త ప్రధానిగా ముస్లిం లీగ్-నవాజ్ పార్టీకి చెందిన షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా షహబాజ్ షరీఫ్ గా ప్రధానిగా ఎన్నుకున్నాయి.
పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1947లో పాకిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిందని… కానీ విదేశీ కుట్రల నుంచి స్వతంత్య్రం పొందేందుకు ఈరోజు నుంచి మళ్లీ పోరాటం మొదలైందంటూ… దేశ ప్రజలే తమ సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటారు అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయింది.