ఏడో‘సారీ’… పాకిస్తాన్‌..!

-

ప్రపంచకప్‌ క్రికెట్‌లో భాగంగా జరిగిన భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో భారత్‌ దుర్భేద్యమైన వ్యూహరచనతో పాకిస్తాన్‌ను పాతరేసింది. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఓటమనేదే లేని రికార్డును ఇండియా ఘనంగా మెరుగుపరిచింది. ఈ మ్యాచ్‌కూ వర్షసూచనుందన్న ఇంగ్లండ్‌ వాతావరణ శాఖ హెచ్చరికల మధ్య, కోట్లాదిమంది భారత్‌-పాక్‌ అభిమానుల ప్రార్థనల మధ్య, మ్యాచ్‌ నిర్విఘ్నంగా సాగింది. మధ్యలో కొంతసేపు వర్షం అంతరాయం కలిగించినా, ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేకపోవడం ఊరట కలిగించింది.

మాంచెస్టర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో దాయాది-ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ అజేయ రికార్డు చెక్కుచెదరలేదు. భారత అభిమానులు ఒళ్లంతా కండ్లు చేసుకుని చూసిన మ్యాచ్‌లో ఇండియన్స్‌ పాక్‌ను పాతరేశారు. ఏ ఒక్క క్షణంలోనూ తడబడకుండా ఓ పద్ధతిలో నిర్మించిన ఇన్నింగ్స్‌, భారత వ్యూహరచనను కళ్లకుకట్టినట్టు చూపింది. భారత ఆటగాళ్ల విజృంభణ ముందు పాకిస్తాన్‌ దూదిపింజలా తేలిపోయింది. ఆదివారం డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ము గిసిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో పాక్ పై జయభేరి మోగించింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ సెంచరీకి.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (65 బం తుల్లో 77; 7 ఫోర్లు), రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు తోడవడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 336 పరుగులు చేసింది.

పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్‌కు 3 వికెట్లు దక్కాయి. లక్ష్య ఛేదనలో కుల్దీప్ (2/32), పాండ్యా (2/44), శంకర్ (2/22) ధాటికి పాకిస్థాన్ 34.4 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఈ దశలో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302గా సవరించారు. నిజానికి అప్పటికే ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఔటవడంతో పాక్‌ ఓటమి ఖాయమైంది. ఫఖర్ జమాన్ (75 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (48; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. విశ్వవేదికపై ఇప్పటికే ఆరుసార్లు పాక్‌ను పాతరేసిన టీమ్‌ఇండియా.. ఈ విజయంతో ఏడోసారి కూడా వారికి ఏడుపే మిగిల్చింది.


1.  భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 358 సిక్సర్లు కొట్టిన రోహిత్.. ధోనీ(355)ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరాడు.

2. భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో ద్రవిడ్ (340)ను వెనక్కి నెట్టి ధోనీ (341 ) రెండో స్థానానికి చేరాడు. సచిన్ (463 ) టాప్‌లో ఉన్నాడు.

3. ప్రపంచకప్‌లో తొలి బంతికే వికెట్ తీసిన మూడో బౌలర్‌గా విజయ్ శంకర్ నిలిచాడు.

విశ్వ సమరంలో పాక్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(140) సాధించిన క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లోకెక్కాడు. విరాట్(107), సయిద్ అన్వర్(101) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారు.

2. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. 2015లో విరాట్ కోహ్లీ (107) దాయాదిపై తొలిసెంచరీ నమోదు చేశాడు.

3. పాక్‌పై వేగంగా సెంచరీ చేసిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్(85 బంతులు) నిలిచాడు. తొలి రెండు స్థానాల్లో సెహ్వాగ్(80, 84 బంతులు) ఉన్నాడు.

4. ప్రపంచకప్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. 1987లో సిద్ధు, 1996లో సచిన్, 2011లో యువరాజ్ ఈ ఘనత సాధించారు.
336/5 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2015లో చేసిన 300/7 ఇప్పటి వరకు అత్యధికం.

136 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పైభారత్‌కు ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యం. సచిన్ – సిద్ధు 90 పరుగుల (1996లో) రికార్డు తెరమరుగైంది. ఓవరాల్‌గా పాక్‌పై విశ్వకప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్.

స్కోరు బోర్డు

భారత్: రాహుల్ (సి) బాబర్ (బి) వహాబ్ 57, రోహిత్ (సి) వహాబ్ (బి) హసన్ అలీ 140, కోహ్లీ (సి) సర్ఫరాజ్ (బి) ఆమిర్ 77, పాండ్యా (సి) బాబర్ (బి) ఆమిర్ 26, ధోనీ (సి) సర్ఫరాజ్ (బి) ఆమిర్ 1, శంకర్ (నాటౌట్) 15, జాదవ్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 50 ఓవర్లలో 336/5. వికెట్ల పతనం: 1-136, 2-234, 3-285, 4-298, 5-314, బౌలింగ్: ఆమిర్ 10-1-47-3, హసన్ అలీ 9-0-84-1, వహాబ్ 10-0-71-1, ఇమాద్ 10-0-49-0, షాదాబ్ 9-0-61-0, మాలిక్ 1-0-11-0, హఫీజ్ 1-0-11-0.

పాకిస్థాన్: ఇమామ్ (ఎల్బీ) శంకర్ 7, ఫఖర్ (సి) చహల్ (బి) కుల్దీప్ 62, బాబర్ (బి) కుల్దీప్ 48, హఫీజ్ (సి) శంకర్ (బి) పాండ్యా 9, సర్ఫరాజ్ (బి) శంకర్ 12, మాలిక్ (బి) పాండ్యా 0, ఇమాద్ (నాటౌట్) 46, షాదాబ్ (నాటౌట్) 20, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 40 ఓవర్లలో 212/6. వికెట్ల పతనం: 1-13, 2-117, 3-126, 4-129, 5-129, 6-165, బౌలింగ్: భువనేశ్వర్ 2.4-0-8-0, బుమ్రా 8-0-52-0, శంకర్ 5.2-0-22-0, పాండ్యా 8-0-44-2, కుల్దీప్ 9-1-32-2, చహల్ 7-0-53-0.

Read more RELATED
Recommended to you

Exit mobile version