భారీ వర్షాలు, వరద బీభత్సంతో పాకిస్తాన్ అతలాకుతలమవుతుంది. పాకిస్తాన్ లో వరదల వల్ల సుమారు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం చోటుచేసుకుంది. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఓ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ లో వరదల వల్ల జరిగిన విద్వాంశాన్ని చూసి తాను చెలించిపోయానని తెలిపారు.
బాధితులకు సానుభూతి, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అతి త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో భారత ప్రధాని మోడీ స్పందించినందుకు పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ , మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ దేశంలో వరదల కారణంగా ఏర్పడ్డ ఆస్తి, ప్రాణ నష్టాలపై స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
I thank 🇮🇳 PM Narendra Modi @narendramodi for condolences over the human & material losses caused by floods. With their characteristic resilience the people of 🇵🇰 shall, InshaAllah, overcome the adverse effects of this natural calamity & rebuild their lives and communities.
— Shehbaz Sharif (@CMShehbaz) August 31, 2022