పవన్ కళ్యాణ్ బర్త్ డే కి భారీ స్కెచ్ వేసిన బండ్ల ..ఊహించని గిఫ్ట్..!!

-

పవన్ కళ్యాణ్ కి ప్రముఖ నటుడు , నిర్మాత, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ వీరాభిమాని అని చెప్పవచ్చు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి నమ్మిన బంటు లాంటివాడు బండ్ల గణేష్.. ఒకవైపు కమెడియన్గా వెండి తెర పై అలరించిన ఈయన నిర్మాతగా కూడా రాణించారు. కమెడియన్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో తన మార్కును చూపించిన ఈయన.. మాటల తూటాలతో జనం మదిలో నిలిచిపోయారని చెప్పవచ్చు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు బిజినెస్ మాన్ గా కూడా బండ్ల గణేష్ సత్తా చాటుతున్నారు అంతేకాదు రాజకీయాలలో కూడా యాక్టివ్ గా ఉండే ఈయన తన గురువు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో మాత్రం చేరలేదు. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తూ రాజకీయం వేరు సినిమా ఇండస్ట్రీ వేరు అంటూ నిరూపించారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ అంటే బండ్ల గణేష్ కి ఎంత ఇష్టమో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ నా దేవుడు అంటూ ఓపెన్ గా మాట్లాడే బండ్ల గణేష్ వీలు కుదిరినప్పుడల్లా ఆయనపై ఎక్కడలేని ప్రేమ చూపిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తలుచుకుంటూ పవన్ కళ్యాణ్ అభిమానులకు బూస్ట్ ఇవ్వబోతున్నారు బండ్ల గణేష్. సెప్టెంబర్ 2వ తేదీన పవర్ స్టార్ బర్తడే రానున్న నేపథ్యంలో స్పెషల్ ట్రీట్ రెడీ చేసి పెట్టిన బండ్ల గణేష్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా తాను నటించిన డేగల బాబ్జి సినిమాను ఆహా ఓటీటీ వేదికగా తీసుకొస్తున్నారు.ఇక పవర్ స్టార్ బర్తడే స్పెషల్ లా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు బండ్ల గణేష్ ట్వీట్ చేయడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హీరో గా మొదటి అడుగు వేసిన బండ్ల గణేష్ ఎలా మెప్పిస్తాడో తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version