గూఢచర్యం కేసు కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న కుల్ భూషన్ జాదవ్ పాక్ జైల్లో మగ్గుతున్నాడు. తాజాగా కుల్ భూషన్ తరుపున కేసును వాదించేందుకు న్యాయవాదిని నియమించుకోవాలని ఇస్లామాబాద్ హైకోర్ట్ భారత్ కు అవకాశం ఇచ్చింది. ఎప్రిల్ 13 లోపు న్యామవాదిని నియమించుకోవాలని పాక్ హైకోర్ట్ భారత్ ను కోరింది.
2017లో గూఢచర్యం కింద కుల్ భూషన్ జాదవ్ ను పాక్ ఆర్మీ పట్టుకుంది. దీంతో పాక్ మిలిటరీ కోర్ట్ ఆయనకు మరణ శిక్ష విధించింది. పాక్ ఈ కేసులో కాన్సులేట్ యాక్సెస్ ఇవ్వకపోవడంతో.. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇరువైపులా విన్న తర్వాత, ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం 2019లో తీర్పును వెలువరించింది, జాదవ్‌కు భారత కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని, అతని నేరాన్ని సమీక్షించేలా చూడాలని పాకిస్తాన్‌ను కోరింది.
ఇదిలా ఉంటే పాక్ మంత్రి ఫవాద్ హుస్సెన్ పాక్ లో టెర్రర్ కుట్రలకు, బెలూచిస్థాన్, కరాచీల్లో పేలుళ్ల వెనక భారత్ ఉందని కుల్ భూషన్ జాదవ్ అరెస్ట్ అందుకు నిదర్శనం అని ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇరాన్ లో వ్యాపారం చేసుకుంటున్న కుల్ భూషన్ ను పాక్ అక్రమంగా నిర్భందించి.. గూఢచర్యం కేసులను పెట్టిందని భారత్ ఆరోపిస్తోంది.