అక్కడ కాంగ్రెస్‌ కార్యక్రమాలనూ అధికారపార్టీ నేతలే డిజైన్‌ చేస్తున్నారా…?

-

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా చతికిల పడింది. జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన నాయకులు జిల్లాలో ఉన్నా.. కాంగ్రెస్‌ పరిస్థితి పూర్తిగా హస్తవ్యస్తంగా మారింది. అక్కడి కాంగ్రెస్‌ కార్యక్రమాలను సైతం అధికార పార్టీ నేతలే డిజైన్‌ చేస్తున్నారనే విమర్శలు సొంత శిబిరంలోనే వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని కార్నర్‌ చేసే అంశాల్లోనూ అందిపుచ్చుకోవడం లేదన్న కామెంట్స్‌ ఉన్నాయి.

తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014లో ఉత్సాహంగా ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్‌కు జిల్లాలోని 14 స్థానాల్లో ఐదే చేతికి చిక్కాయి. 2018 ఎన్నికల్లో కొల్లాపూర్‌లో తప్ప జిల్లాలో ఎక్కడా ప్రభావం చూపించలేకపోయింది. ఈలోగా సీనియర్లు అనుకున్న నేతలు ఎక్కడికక్కడ సర్దుకున్నారు. చివరకు కొల్లాపూర్‌లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సైతం టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్‌ గుండు సున్నా.

ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్నవారిలో చెప్పుకోదగ్గ నాయకులు రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మల్లురవి, సమరసింహారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి ఉన్నారు. కేవలం పదవుల కోసం పాకులాడటం తప్ప జిల్లాలో పార్టీ బలోపేతానికి దృష్టిపెట్టడం లేదని వీరిపై విమర్శలున్నాయి. శ్రీశైలం, కల్వకుర్తి ప్రమాదాలపై స్పందించిన నాయకులు అక్కడికి వెళ్లాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. కానీ.. వారికి మద్దతుగా జిల్లాలో ఆందోళనలు చేసిన పరిస్థితి లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version