తండ్రిని కావాలనే బలమైన కోరికను జైలు గోడలు కూడా ఆపలేకపోయాయి. దానికి తన తల్లి, భార్య నుంచి సపోర్ట్ లభించింది. దీంతో జైలు గోడల మధ్య 15 ఏళ్లు ఉన్నా… నలుగురు బిడ్డలకు తండ్రయ్యాడు. వినడానికి కాస్త వింతగా, అసాధ్యంగా ఉన్నా ఇదే నిజం. తాజాగా జైలు నుంచి విడుదలయిన తర్వాత.. నాభర్త ఈ బిడ్డలకు తండ్రి అని భార్య ప్రకటించింది. భర్త కూడా తానే ఈ బిడ్డలకు తండ్రి అని ప్రకటించడంతో అందరూ అవాక్కయ్యారు. అసలు ఇది ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పాలస్తీనా చెందిన రఫత్ అల్ ఖరావి కరడుగట్టిన ఉగ్రవాది. ఇజ్రాయెల్ కు వ్యతిరేఖంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తున్న ఇతన్ని 2006లో జైలులో వేశారు. సరిగ్గా 15 ఏళ్ల తరువాత 2021 మార్చిలో విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తన నలుగురి బిడ్డలకు తండ్రిని నేనే అన్నాడు. పాలస్తియన్ మీడియా వాచ్ కథనం ప్రకారం… 15 ఏళ్ల కాలంలో జైలు గోడలు దాటని ఖైదీ… తన తల్లి, క్యాంటీన్ లో సిబ్బంది సహాయంతో తన భార్య ద్వారా తండ్రయ్యాడు.
జైలులో ఉన్న సమయంలో తన వీర్యాన్ని పాలిథిన్ కవర్లలో, బిస్కెట్ కవర్లలో బయటకి పంపేవాడు. అతని భార్య, తల్లి వచ్చి ఈ వీర్యాన్ని తీసుకునేవారు. ఈ స్పర్మ్ ను రజాన్ మెడికల్ సెంటర్ తరలిచించి అక్కడి నిపుణుల ద్వారా తన భార్య గర్భంలో ప్రవేశపెట్టేవాడినని వెల్లడించారు. అయితే ఇదంతా చట్ట విరుద్ధం అని తెలిసినా.. పిల్లలపై ఉన్న ఆశతో ఇలా చేశానని చెప్పుకొచ్చాడు రఫత్ అల్ ఖరావా.