బూట్లు నాకి బిజెపి అధ్యక్షుడు అయ్యాడు.. బండి సంజయ్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ సంచలనం

-

మోడీ, అమిత్ షా బూట్లు నాకి … అధ్యక్ష పదవిని బండి సంజయ్.. తెచ్చుకున్నాడని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరికి, గోధుమలకు తేడా తెలీదు, తెలివి తక్కువ వెధవ, బ్రోకర్ అంటూ బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ అధికారులు మళ్ళీ అవే అబద్ధాలు చెప్పారని.. పిఎంవో ఆదేశాలతో బిజెపి నేతలు పోటీ దీక్ష చేశారని అగ్రహించారు. బిజెపి నాయకులు పిచ్చికుక్కల్ల మాట్లాడ్తున్నారు.. మనుషులు నోటితో మాట్లాడతారు…కానీ బండి సంజయ్ ఆయన శరీరంలోని వేరే అవయలతో మాట్లాడ్తున్నారని మండిపడ్డారు.

ధాన్యం సేకరణ కేంద్ర ప్రభుత్వ విధి ఎఫ్సీఐదని.. పారా బాయిల్డ్ రైస్ తీసుకొము అని కేంద్రం అంటే…మరి ఏం ఇవ్వాలి ? అని నిలదీశారు. బండి సంజయ్ నేతృత్వంలోని బిజెపి కుక్కలు రైతులను వరి వెయ్యలని చెప్పారు.. పిచ్చి.. పిచ్చి మాటలతో.. తెలంగాణ లో రైతులు వరి ధాన్యం పండించాలని అన్నారని చురకలు అంటించారు. బండి సంజయ్ ఆత్మ గౌరవం లేని సన్యాసి అని.. సిగ్గు శరం ఉందా ? నీకు తెలుసారా ? తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయా ? అని ఫైర్ అయ్యారు. నేను రైతు బిడ్డను…నన్ను తిడతావా ? మిర్చికి ఎంఎస్పీ ఉండదని బండి సంజయ్ కి తెలియదని మండిపడ్డారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version