లాక్ డౌన్ ఏమో గాని చాలా మంది మద్యం కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు లాక్ డౌన్ తీస్తారా ఎప్పుడు మద్యం అమ్ముతారా అని ఎదురు చూస్తున్నారు. చాలా మందికి ఇప్పుడు లాక్ డౌన్ లో మద్యం దొరకక పిచ్చి ఎక్కే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితికి వచ్చేశారు అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. పిచ్చి కల్లుకి అలవాటు పడిన వారి పరిస్థితి మరీ దారుణం.
ఆ మందు ఒసం చాలా మంది ఇప్పుడు కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. దాని అవసరం ఉన్న వాళ్ళు ఏదోక మార్గం లో దాన్ని తెచ్చుకోవాలి అని చూస్తున్నారు. తాజాగా రోగులను తరలించే అంబులెన్స్ లో కూడా కల్లు తరలించడం ఆశ్చర్యం కలిగించింది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో కల్లు తరలిస్తున్న ఇద్దరిని ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాపూనగర్‌కు చెందిన గణేష్, బాలకృష్ణ రెండు క్యాన్లలో 30 లీటర్ల కల్తీ కల్లు తీసుకొని బేగంపేట చేరుకొని అక్కడి నుంచి ఒక ప్రైవేట్ అంబులెన్స్ లో, బల్కంపేట చేరుకున్నారు. ఎస్సై సాయినాథ్, సిబ్బందిఆ వాహనం సోదా చేయగా కల్లు తరలిస్తున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి తరలించారు.