ప్రపంచంలో అధిక మరణాలకు కారణమయ్యేది గుండెజబ్బు. ఎప్పుడు ఎలా యటాక్ అవుతుందో ఎవరికీ తెలియదు. అప్పటివరకూ అంతా బానే ఉంటుంది కానీ.. అంతలోనే జీవితం అంతమయిపోతుంది. దీనికి పేద. ధనిక అంటూ ఏం లేదు. వచ్చిందంటే ఎవరైనా ఎఫెక్ట్ అవ్వాల్సిందే. మొన్నటికిమొన్న మంత్రి గౌతమ్ రెడ్డి మరణం చూడండి. క్షణాల్లోనే అంతా అయిపోయింది.
మరే ఇతర జబ్బులు అయినా.. తగ్గించుకోవచ్చేమో కానీ, ఆసుపత్రికి వెళ్లే టైం కూడా లేకుండా హార్ట్ ఎటాక్స్ మనిషిని ఈ ప్రపంచానికి దూరం చేస్తున్నాయి. ఈరోజు మనం గుండె జబ్బులకు ప్రధాన కారణం ఏంటి.. ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం..
గుండెజబ్బులకు ప్రధాన కారణం.. రక్తనాళాల్లో ఫ్యాట్ పేరుకుంటుంది. కరోనరి ఆట్రిస్ లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెకు రక్తసరఫరా తగ్గి హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. గుండెకు హాని కలగడానికి ప్రధాన కారణం కొవ్వే కదా.. మరీ ఈ పేరుకున్న కొవ్వు తగ్గడానికి, లేనివారికి రాకుండా చేయడానికి పంచరత్న కషాయం ఒకటి ఉంది. ఇందులో వాడే ఐదు ఔషదగుణాలున్న వాటిని సైంటిఫిక్ గా ఎన్నో దేశాలు వారు పరిశోధన చేసి నిరూపించారు.
అందులో మొదటిది వెల్లుల్లి.. వెల్లుల్లి రెబ్బలు రోజుకు 15- 20 గ్రాములు వాడుకుంటే.. వెల్లుల్లిలో ఉండే అలిసిన్( Allicin) అనే కెమికల్ మనం తిన్న ఆహారంలో లాలాజలంతో కలిసి అనిలిన్( Aniline) గా మారుతుందట. ఇది లివర్ లో కొలెస్ట్రాల్ తయారవకుండా ఆపడానికి బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలో పేర్కొన్నారు. ఇంకా వెల్లుల్లిలో అనిలేజ్( Allinase), ఎల్- సిస్సిటన్ సల్ఫాక్సైడ్( L- cysteine Sulfoxide), తియోసల్ఫరేట్స్ (Thiosulphate) అనే ఎంజైమ్స్ వెల్లుల్లిలో ఉండటం వల్ల లివర్ కొలెస్ట్రాల్ తయారవడానికి కావాల్సిన ఎంజైమ్స్ ను ఇవి అడ్డుకుని ఫ్యాట్ ను నిరోధిస్తుందని 120మందిపై పరిశోధన చేసి 2016వ సంతవ్సరంలో ఇస్ఫనాన్ యూనివర్శిటి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( Isfahan University In Iran)వారు నిరూపించారు.
రోజుకు 20 గ్రాములు వెల్లుల్లి వాడినప్పుడు 29 మిల్లీగ్రాములు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం రెండు నెలల్లలోనే 40 మిల్లీగ్రాములు టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటం జరిగిందట.
ఇక రెండవది పసుపు.. పసుపు రక్తనాళాలను స్మూత్ చేయడానికి, రక్తనాళాల లోపల ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందట. పసుపులో ఉండే కర్క్యూమిన్ ( Curcumin) అనే కెమికల్ కాంపౌడ్ వీటికి బాగా పనికొస్తుందని 2016వ సంవత్సరంలో కొరియా ఫుడ్ రీసర్చ్ ఇన్సిట్యూట్ ( korea food research Institute-Korea) వారు నిరూపించారు.
మూడవది దాల్చిన చెక్క..రోజుకు 1-2 గ్రాములు వాడితే ఇందులో ఉండే పాలిఫినాల్స్(polyphonols) , సిమనిక్ యాసిడ్ (Cinnamic acid), సినిమాల్డ్ హైడ్( Cinnamaldehyde) అనే కెమికల్ కాంపౌండ్స్ రక్తనాళాలలను సాగేటట్టు చేస్తుందట. బ్లడ్ వెజల్స్ సాగటం వల్ల బ్లడ్ ఫ్లో ఈజీ అవుతుంది. ఇలా ఎనిమిది వారాలు తీసుకుంటేనే 40Ml గ్రాములు టోటల్ కొలెస్ట్రాల్ తగ్గటం, 30 ML బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటం జరిగిందట.
ఇక నాల్గవది మిరియాలు.. ఇందులో ఉండే పెప్పరిన్( Piperine) అనే కెమికల్ బ్లడ్ వెజిల్స్ ముడుకోకుండా, దగ్గరకు రాకుండా చేస్తుందని 2010లో కామినస్ యూనివర్శిటి ( Comenius University- Slovakia) వారు పరిశోధన చేసి ఇచ్చారు.
ఇక లాస్ట్ పంచరత్నం పుదినా.. ఇందలో ఉండే మెంతాల్ (Menthol), మెంతోన్( Menthone) అనే కెమికల్ కాంపౌండ్స్ బ్లడ్ లో కెమికల్ లెవల్స్ ను తగ్గిస్తున్నాయని 2015 వ సంవత్సరంలో బిర్జండ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ( Birjand Univeristy Of Medical sciences- Iran) నిరూపించారు.
ఈ ఐదు రకాల ఐటమ్స్.. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఉండటానికి, పేరుకున్నా కరగడానికి ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్ ఇచ్చారు కాబట్టి.. మనం డైలీ తినే ఆహారంలో వీటిని ప్రాధానంగా వాడుకోవచ్చు. లేదా ఈ ఐదు వేసి నీళ్లు పోసి మరిగించి ఫిల్టర్ చేసి తేనె వేసుకుని కషాయం లాగా కూడా తాగొచ్చు.
-Triveni Buskarowthu