పంజాగుట్ట లో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. తెలిసిన వారే హత్య చేసి పంజాగుట్ట లో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కన్పించిన ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోవడంతో నిందితుల ఆచూకీ అభించడం కష్టంగా మారింది. మృతదేహం లభ్యమైన కొద్ది దూరంలో సీసీ కెమెరాలు ఉన్న చిత్రాలు స్పష్టంగా లేకపోవడంతో పరిసరాల్లోని అన్ని సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు.
పోస్టుమార్టం నివేదికలో ఊపిరితిత్తుల కింది భాగం మరియు మూత్రపిండాలపై భాగంలో బలమైన గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. నింధితుల్ని గుర్తించేందుకు మొత్తం ఆరు బృందాలను రంగంలోకి పోలీసులు ఉన్నతాధికారులు రంగంలోకి దింపారు. మృతదేహం పడేవేసిన సమయంలో ఆ పరిసరాల్లో తిరిగిన వాహనాలను పై పోలీసులు నిఘా పెట్టారు. ఇక బాలిక మృతి పట్ల స్థానికులు సైతం ఆందోళన చెందుతున్నారు.