భారతీయ రైళ్లలో సాధారణంగా చెప్పేది ఒకటి జరిగిది మరొకటి ఉంటుంది. ప్రభుత్వం ఎమ్మార్పీకి ఫుడ్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అమ్మాలని చెబుతుంటే క్యాటరింగ్ వాళ్లు మాత్రం డబుల్‌కు అమ్ముతుంటారు. ఈ క్రమంలోనే హేమకుంట్ ఎక్స్‌ప్రెస్(14609)లో విశాల్ శర్మ అనే యూట్యూబర్ ప్రయాణం చేస్తుండగా ప్యాంట్రీ సిబ్బంది అధిక ఛార్జీలు వసూలు చేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు.
దీంతో ఆవేశంతో ఊగిపోయిన ప్యాంట్రీ సిబ్బంది.. మాపైనే ఫిర్యాదు చేస్తావా? అంటూ విశాల్ శర్మ అనే ప్రయాణికుడి మీద దాడికి పాల్పడ్డారు. సదరు యువకుడు తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నా అతని చొక్కా చించేసి సిబ్బంది దాడికి పాల్పడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటనపై నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ రైలు ప్రయాణికుడి మీద దాడి
ట్రైన్‌లో క్యాటరింగ్ సిబ్బంది అధిక ఛార్జీలు వసూలు చేశారని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు.. మా పై ఫిర్యాదు చేస్తావా అంటూ ప్రయాణికుడిపై దాడి
హేమకుంట్ ఎక్స్‌ప్రెస్(14609)లో విశాల్ శర్మ అనే యూట్యూబర్ ప్రయాణం చేస్తుండగా క్యాటరింగ్… pic.twitter.com/10Tleluz5a
— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025