నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

-

ఢిల్లీ: రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం ప్రారంభంలో జరగాల్సిన ఈ సమావేశాలు ఎన్నికల దృష్ట్యా ముందుగానే ప్రారంభించనున్నారు. నెల రోజులపాటు జరగాల్సిన ఎన్నికలను రెండు వారాలకే కుదించారు. దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు.

పార్లమెంట్

కరోనా వేళ పార్లమెంట్ సమావేశాలు ఎంతో జాగ్రత్తగా నిర్వహించారు. రాజ్యసభ సమావేశాలు ఉదయం నిర్వహిస్తే.. లోక్‌సభ సమావేశాలు సాయంత్రం నిర్వహించారు. కానీ, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ రెండు సభలను ఉదయం 11 గంటలకే ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే ఏప్రిల్ 8వ తేదీన సుమారు నెల రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు వారాలకే కుదించారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సముఖత చూపడంతో ప్రారంభం రోజే దీనిపై రెండు ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సమావేశాల్లో పలు బిల్లలపై చర్చించనున్నారు. పింఛను నిధి నియంత్రణ- అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సవరణ బిల్లు, మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చే జాతీయ బ్యాంకు బిల్లు, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, క్రిప్టో కరెన్సీ వంటి బిల్లులను పరిశీలించనున్నారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ అయ్యారు. సోనియాగాంధీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, వ్యవసాయ చట్టాలు, పెట్రోల్ ధరల పెరుగుదల, సామాజిక మాధ్యమాలపై విధించిన నిబంధనలు, తదితర విషయాలపై సోనియా గాంధీ చర్చించారు. అయితే ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీల సీనియర్ నాయకులు ఈ పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version