గులాబీ పార్టీలో కలకలం నెలకొంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లు తీసేస్తున్నారు పార్టీ శ్రేణులు. దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అటు కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు దహనం చేసారు. హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసారు.

హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని దహనం చేశారు బీఆర్ఎస్ నాయకులు. కల్వకుంట్ల కవిత… బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.
కాగా పార్టీ క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘిస్తే సొంత కూతురి పైన కూడా చర్యలు తీసుకోడానికి వెనకాడని కేసీఆర్ నిర్ణయాలు అభినందనీయం అన్నారు జుక్కల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.