ఆంద్రాలో రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన తొలి సినిమాగా రికార్డ్ !

-

బాలీవుడ్ లో చాలాకాలం తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ నిలిచింది. ఈ సినిమాలో తన అనుభవాన్ని అంతా రంగరించి చేసిన నటనకు ఇండియాలోని సినీ అభిమానులు అందరూ ఫిదా అయ్యి బంపర్ హిట్ చేశారు. ఇందులో షారుఖ్ సరసన దీపికా పదుకునే నటించగా, జాన్ అబ్రహం ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించాడు. సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే చాలా రికార్డులను తన పేరిట లిఖించుకుంది. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆంధ్ర నైజం ఏరియాలో అత్యధిక కలెక్షన్ లను సాధించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కూడా నైజం ఆంధ్ర పరిసరాలలో రూ. 50 కోట్లు వసూలు చేయకపోవడం గమనార్హం. ఇప్పుడు పఠాన్ సినిమా దెబ్బతో ఆ లోటు తీరిపోయింది. కాగా ఓటిటి ప్లాట్ ఫామ్ లోనూ దూసుకువెళుతుండడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version