60 ఏళ్లుగా యంత్రంలోనే జీవితం.. గాలికూడా పీల్చలేడు కానీ… గ్రాడ్యూయేషన్ చేసి నోటితో బుక్ రాశాడు..!

-

ఈ కరోనా వల్ల ఇలా ఉన్నాం కానీ..ఇంతకముందు ఒక్కరోజులోనే బయట భీభత్సంగా తిరిగే ఉంటారుగా.. స్టూడెంట్స్ అయితే ఆదివారం రోజు..ఎంప్లాయిస్ వీక్ ఆఫ్ రోజు ఎన్నెన్ని ప్లాన్స్ వేసుసుంటాం. అలాంటి మన జీవితంలోకి కరోనా మహమ్మారి రావటం వల్ల ఇంట్లోంచి బయటకు వెళ్లటానికి లేకుండా పోయింది. ఆ రోజుల్లో ఎంతో ఇబ్బందిపడ్డాం కదా..అలా కొన్నినెలలు ఉండటానికి మనకు నరకం అనిపించింది ఒక దశలో. అలాంటిది ఒక వ్యక్తి ఆరేళ్ల వయసులునుంచి ఒక యంత్రంలోనే జీవిస్తున్నాడట..బయటప్రపంచం చూడలేదు. గాలీ పీల్చలేడు. అన్నీ ఆ యంత్రంలోనే. అసలు వినటానికే నమ్మశక్యంగా లేదు కదా..కానీ ఇప్పుడు ఆ పెద్దాయన ఆ యంత్రంలోనే ఉంటూ చదువుకొని రైటర్ కూడా అయ్యాడు..ఆ యంత్రం ఏంటి..ఆ కథేంతో తెలుసుకుందాం.

పాల్ రిచర్డ్ అలెగ్జాండర్. వృత్తి రీత్యా లాయర్. రచయిత కూడా. 1946లో పుట్టాడు. ఆరేళ్లకే అంటే.. 1952లో పోలియో వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఓ యంత్రంలోనే ఉన్నాడు. అందులోనే చదువుకున్నాడు. లాయర్ కూడా అయ్యాడు. ప్రేరణ కలిగించే బుక్ రాశాడు. అందులో తన కథనే రాసుకున్నాడు.. నోటితో పెన్ను పట్టుకొని ఆ బుక్ రాయడం విశేషం.

పోలియో సమస్య:

1950లో అమెరికాను పోలియో కుదిపేసింది. వందలమంది పిల్లల జీవితాల్ని అంధకారం చేసిన జాబితాలో పాల్ రిచార్డ్ కూడా ఉన్నారు. అప్పుడు పిల్లలందరిని పార్క్‌లాండ్ ఆస్పత్రికి తరలించారు. పోలియో అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కాళ్లు వంకర్లు తిరిగితే… మరికొందరికి ఇతర అవయవాలు దెబ్బతింటాయి. కానీ పాల్ రిచర్డ్‌.. తల, మెడ, నోరు తప్పితే ఇంకేవీ కదపలేడు. అన్నింటికీ పోలియో వచ్చింది.

 జీవితం అంతా యంత్రంలోనే గడిచిందట:

పార్క్‌లాండ్ ఆస్పత్రిలో ఐరన్ లంగ్స్ వార్డ్ ఉంది. పోలియో వచ్చే కొందరు పిల్లలు ఊపిరి కూడా తీసుకోలేరు. అలాంటి వారికి ఐరన్ లంగ్ అమర్చుతారు. పాల్ రిచర్డ్ ఆస్పత్రిలో ఊపిరి పీల్చలేక ఇబ్బంది పడుతుంటే సడెన్‌గా ఓ డాక్టర్ గుర్తించి.. హడావుడిగా ఐరన్ లంగ్ వార్డుకి తీసుకెళ్లాడు. అక్కడ… అతన్ని ఓ యంత్రంలో ఉంచారు. అది ఊపిరి తీసుకునేలా, వదిలేలా చేస్తుంది. డాక్టర్ల సాయంతో… రెండేళ్ల తర్వాత అంటే 1954 నాటికి పాల్ సొంతంగా ఊపిరి పీల్చుకోవడం నేర్చుకున్నాడు. తద్వారా ఐరన్ లంగ్ అవసరం మెల్లమెల్లగా తగ్గడం మొదలైంది. రోజురోజుకూ అతను స్వయంగా మెరుగవుతూ.. ఐరన్ లంగ్‌పై ఎక్కువగా ఆధారపడకుండా కోలుకున్నాడు. కానీ పూర్తిగా కోలుకోలేదు. అందువల్ల అతనికి ఆ యంత్రం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది.

యంత్రంలోనే చదువు:

యంత్రంలోనే ఉంటూ చదువుకున్న పాల్ 21 ఏళ్లకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. క్లాస్‌లో టాప్ 2లో నిలిచాడు.అప్పట్లో అంటే 1967లో డల్లాస్ హైస్కూల్‌కి డైరెక్టుగా క్లాసులకు వెళ్లకుండా గ్రాడ్యుయేషన్ చేసిన మొదటి వ్యక్తి ఆయనే. ఆ తర్వాత 1984లో లా డిగ్రీ చేసిన పాల్ ఓ ఉద్యోగం సంపాదించాడు. కోర్టులో స్టెనోగ్రాఫర్లకు లీగల్ భాష బోధించే టీచర్ అయ్యాడు. ఆ తర్వాత 1986లో లాయర్‌ అయ్యాడు.

2020 ఏప్రిల్‌లో ఈ పెద్దాయన తన జీవితాన్నే పుస్తకం Three Minutes for a Dog అనే పేరుతో ఆటోబయోగ్రఫీ రాసి పబ్లిష్ చేశాడు. ఆ పుస్తకాన్ని నోటితో రాసేందుకు ఆయనకు 8 ఏళ్లు పట్టిందట.

ఇది ఆ పెద్దాయన కథ..జీవితం ఓ పక్క జీవితం ఇంత దయనీయంగా ఉన్నా పాల్ పట్టువదలలేదు. మామూలుగా ఉన్నవారికంటే తనకేం తక్కువ లేదన్నట్లు..చదువుకున్నాడు.లాయర్ అయ్యాడు. ఒక బుక్ కూడా రాశాడు. విధిరాతను ఎదిరిస్తూ సాగిన పాల్ జీవితం ఎంతోమందికి ఆదర్శం. కానీ ఈరోజుల్లో చిన్నిచిన్న కారణాలకే మనషులు సూసైడ్ చేసేసుకుంటారు. దేవుడిచ్చిన జీవితం మళ్లీ అదే దేవుడు తీసుకునే వరకూ బతకాలి కదా..సమస్యకు భయపడకుండా..ధైర్యంగా ముందడుగువేయాలని పాల్ జీవితం మన కళ్లకు కట్టినట్లు చెప్తుంది.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version