నాపై అభిమానం ఉన్న వారికి తగ్గటం నచ్చదు : పవన్ కళ్యాణ్

-

నన్ను గాల్లో, కార్లో రాకుండా అన్ని రకాలుగా అడ్డుకున్నారు అని పవన్ కళ్యాణ్ అన్నారు. పాలిటిక్స్ మీద నా ఆలోచనలు చెప్పేందుకు సత్యాగ్రహి సినిమా చేద్దాం అనుకున్నా అన్నారు. నాకు బలం లేదని నాకు తెలుసు. పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ రెండు వేర్వేరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రెండు కలపటానికి నాకు సమయం కావాలి ఇందుకే నేను 25 ఏళ్లు కావాలని చెప్పాను అన్నారు. నేను రాజకీయాల్లోకి నా అభిమానుల కోసం రాలేదు కష్టాల్లో ఉన్న వారి కోసం వచ్చాను అన్నారు పవన్ కళ్యాణ్.

నేను సినిమాలు చేసుకుందామని అనుకుంటే నా సినిమా ఇంటర్ నెట్ లో రిలీజ్ చేశారు. అలానే 2 ఎంపీలు, 10 ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో వేస్తే జన సేన పార్టీకి గుర్తింపు వచ్చేది అన్నారు. నాపై అభిమానం ఉన్న వారికి తగ్గటం నచ్చదు కానీ తగ్గటం అవసరం తగ్గే కొద్దీ ఎదుగుతాం తప్ప నాశనం అవ్వము అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version