కవి గా మారిన పవర్ స్టార్.. కవిత సూపర్..!

-

పవన్ కళ్యాణ్ కేవలం గొప్ప నటుడే కాదు ఇప్పుడు ఒక మంచి కవి ఆయనలో ఉన్నారని అందరికీ అర్థమైంది. అభిమానులు ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని వారు ఉండరు. ప్రజల ఆదరణ అభిమానాన్ని సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజు బాలికల దినోత్సవం సందర్భంగా బాలికలికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.

ఆ పోస్ట్ చేసి గంట కూడా దాటలేదు ఆ పోస్టుకి వేలల్లో వ్యూస్ వచ్చాయి ఆ పోస్టు లో ఏముంది అనే విషయాన్ని చూస్తే.. ఒక కవిత ని పోస్ట్ చేశారు ఆయన. ”కంటికి రూపం ఇంటికి దీపమై చమురై కరుకుతూ సగమై కదులుతూ జగమై వెలుగుతూ జగతిని నడుపుతూ చైతన్యం నింపుతూ వర్ధిల్లాలి వందేళ్లు వెలుగొందాలు వెయ్యేళ్ళు” అని పోస్ట్ లో రాశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాసిన కవితకి ఫాన్స్ అయితే ఫిదా అయిపోతున్నారు ఈయన లో ఒక మంచి కవి దాగి ఉన్నారని మెచ్చుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version