శరవేగంగా ప్రభాస్ ‘కల్కి’ షూటింగ్

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ కల్కీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయిందని.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. అయితే భారీ స్థాయిలో తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి మొదటి వారంలో జరుగనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా మే 09న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. కల్కి సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటాని ఉంటారని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించాడు. రానా కూడా అంటాడని తనే ఇండైరెక్ట్ గా చెప్పాడు. ఇక కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో మలయాళ భామ నటిస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version