పవన్ భవిష్యత్తుతో ఆడుకుంటున్న సొంత జనం!

-

పరిపూర్ణంగా రాజకీయాల్లో ఉండాలనే నాయకులు, పార్టీ అధినేతలు ప్రవర్తించాల్సిన ప్రవర్తన.. రచించాల్సిన వ్యూహాలు.. చేయాల్సిన రాజకీయ విమర్శలు.. వెయ్యాల్సిన ఎత్తుగడలు.. ప్రజలకు అందుబాటులో ఉండే ఆలోచనలు.. ప్రజల మెప్పుపొందే కార్యక్రమాలు… ఇవన్నీ చేయడంలో తన అభిమానులు, కార్యకర్తలు ఊహించిన స్థాయిలో చేయడం లేదని పవన్ కల్యాణ్ పై తాజాగా విమర్శలు మొదలయ్యాయి! చిరంజీవి అంటే మిడిల్ డ్రాప్ అయ్యారు కానీ… పవన్ మాత్రం చివరివరకూ రాజకీయాల్లో ఉంటారని నమ్ముతూ, ఉండాలని కోరుకుంటున్న ఆయన అభిమానులు మాత్రం… తాజా పవన్ వ్యూహాలపై పెదవి విరుస్తున్నారు!

అవును… గత 50 – 60 రోజులుగా పవన్ ప్రవర్తన ఫుల్ టైం పొలిటీషియన్ ప్రవర్తనలా లేదని.. అన్నీ అనుభవించేసిన చంద్రబాబును ఈ సమయంలో ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పవన్ అభిమానులు! దానికి కారణం… కరోనా – విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ – రాయలసీమకు పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు అందించే విషయం… వీటన్నింటిలో పవన్ వ్యవహరించిన తీరేనట! యువనాయకుడు, ఉత్సాహవంతుడు అయిన పవన్ కూడా కరోనా సమయంలో జనసైనికులు పొందినంత క్రెడిట్ తన వ్యక్తిగత ఖాతాలో వేసుకోలేదనేది వారి ఆవేదనగా ఉంది! చంద్రబాబు హైదరాబాద్ లో ఉండగా లేనిది, తాను మాత్రం రాష్ట్రం బయట ఉంటే తప్పేంటన్న చందంగా పవన్ ఆలోచన, ప్రవర్తన ఉండటం కచ్చితంగా తప్పే అంటున్నారు జనసైనికులు!

ప్రధాన ప్రతిపక్షం సైలంట్ అయిన వేల… తాను రంగంలోకి దిగి ఉంటే, ప్రజల ఆలోచన మరో రకంగా ఉండేదని… ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చిన బాబే రాష్ట్రం విడిచి బయట ఉంటే… ఒక్క సీటు కట్టబెట్టిన పవన్ మాత్రం ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారు అనే సంకేతాలు బలంగా వెళ్లేవని… ఆ అవకాశాన్ని పవన్ వదులుకున్నారని, ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదనేది జనసైనికుల ఆవేదన! పవన్ ఎప్పటికీ తన తర్వాతే తప్ప తన ముందు కాదనే విధంగా బాబు రచిస్తోన్న వ్యూహాల్లో పవన్ ఇరుక్కుంటున్నారని… తనకు తాను సొంతంగా ఆలోచించి, సొంత ఆలోచనలు చేయాలని జనసైనికులు కోరుకుంటున్నారు!

దీంతో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పవన్ రాజకీయ సలహాదారులు, రాజకీయ వ్యూహకర్తలవైపు మళ్లింది. పవన్ కి అంటే పోని అవగాహన లేకపోవచ్చు, ఆలోచన రాకపోవచ్చు కానీ… జనసేన వ్యూహకర్తలకు ఏమైంది? సలహాదారుల సలహాలు ఎందుకు చప్పబడిపోతున్నాయి? వారు ఎందుకు పవన్ భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు? అనే ఆవేదన జనసైనికులు, పవన్ అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. ఇకనైనా… సరైన వ్యూహాలు రచించాలని.. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉండే వ్యక్తిని రాజకీయాల్లో పవర్ లెస్ స్టార్ గా చేయ్యొద్దని వేడుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version