శ్వాస ఉన్నంత వ‌ర‌కూ మీరే మా దైవం.. ప‌వ‌న్ పై బండ్ల‌..!

-

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్రేక్ష‌కులే కాకుండా ఇండ‌స్ట్రీలోని న‌టీన‌టుల్లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక ఇండ‌స్ట్రీలోని అభిమానుల్లో బండ్ల గ‌ణేష్ ఎంతో ప్ర‌త్యేకం అనే చెప్పాలి. ప‌వ‌న్ క‌ల్యాన్ సినిమా వ‌స్తే సాధార‌ణ అభిమానుల కంటే బండ్ల గ‌ణేష్ ఎక్కువ ర‌చ్చ చేస్తారు. ఇక ప‌వ‌న్ సినిమాల ఆడియో ఫంక్ష‌న్ ల‌కు బండ్ల గణేష్ వ‌చ్చాడంటే అత‌డి స్పీచ్ కోస‌మే ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ఇక మైక్ అందుకున్న బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ స్పీచ్ అద‌ర‌గొడ‌తారు.

ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో బండ్ల స్పీచ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో రెండో స్థానంలో నిలిచింది. ప‌వ‌న్ స్పీచ్ ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండ‌గా బండ్ల స్పీచ్ రెండో స్థానంలో ఉందంటే అత‌డి స్పీచ్ కు ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ట్విట్ట‌ర్ లోనూ బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ పై ట్వీట్ లు చేస్తూ ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. తాజాగా బండ్ల గ‌ణేష్‌ నా పయనం నా జీవితం నా గమ్యం నా ధైర్యం మేము మీతో మా ప్రయాణం మా శ్వాస ఉన్నంత వరకు మీరే మా దైవం జై పవర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version