జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. రాజకీయంగా యాక్టివ్ గా ఉంటేనే, వచ్చే ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోగలము అనే విషయాన్ని కనిపెట్టేశారు. ఒంటరిగా జనసేన ఎన్నికల బరిలోకి వెళ్తే, అది అసాధ్యమని, బిజెపితో కలిసి అడుగులు వేస్తూనే, రాజకీయంగా బలం పెంచుకోవాలని, తద్వారా తాను అనుకున్న కల నెరవేరుతుందని పవన్ ఎప్పుడో గుర్తించారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి బిజెపి జనసేన తో వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావివ్వడంతో పాటు జనసైనికులు అసంతృప్తి పెరిగిపోతూ వస్తోంది. జనసేన బీజేపీ పెద్దలు వ్యవహరిస్తుండడం, బీజేపీ జనసేన పొత్తు ఉన్నా, ఇప్పటి వరకు బీజేపీ అగ్రనేతలు ఎవరు పవన్ కు అపాయింట్మెంట్ జనసైనికులతో పాటు పవన్ కు సైతం ఆగ్రహం కలిగిస్తోంది.
ఇదిలా ఉంటే, ఏదో రకంగా బిజెపి అగ్రనేతలు దృష్టిలో పడేందుకు పవన్ ప్రతి సందర్భంలోనూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా అంతర్వేది లో రథం దగ్ధమైన సంఘటన తనకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. అందుకే అన్ని మొహమాటాలు పక్కన పెట్టి పూర్తిగా హిందూ స్టాండ్ తీసుకుని వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తే, హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తే, ఎవరూ రారు అనుకుంటున్నారా ? నేను బయటకు వచ్చాను అంటూ గట్టిగానే తన వాయిస్ వినిపిస్తున్నారు. హిందూ ఎజెండాపై బయటకు వచ్చి మాట్లాడితే, మతవాది అనే ముద్ర తనపై వేస్తారని తెలిసినా, తాను మాట్లాడుతున్నానని, గతంలో జరిగిన వివిధ ఆలయాల్లో చోటు చేసుకున్న వివాద ప్రమాదాలను ప్రస్తావించి, అన్నింటిపై విచారణ చేయాలని కోరారు.
అసలు ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చాలని, ఉగ్ర కోణంలోనూ చూడాలని, అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలతో దీనిపై విచారణ చేయించాలని కేంద్రాన్ని కోరుతాను అంటూ పవన్ కాస్త గట్టిగానే చెప్పారు. హిందూ దేవాలయాలుపై జరుగుతున్న దాడులు అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యేందుకు పవన్ ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునేలా కనిపిస్తున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలా అయినా బీజేపీ అగ్రనేతల నుంచి తనకు పిలుపు రావడంతో పాటు, తన ప్రాధాన్యత ను బీజేపీ బాగా గుర్తిస్తుందని పవన్ అభిప్రాయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
-Surya