కొడాలిపై పవన్ ఫోకస్…గుడివాడలో ట్విస్ట్?

-

ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని లాంటి నేతల బలం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…పూర్తిగా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్…ప్రజా మద్ధతు ఎక్కువ ఉన్న నాయకుడు..ఇలాంటి నేతకు చెక్ పెట్టడం అనేది ప్రత్యర్ధులకు సాధ్యం అవ్వని పని..గత రెండు ఎన్నికల్లో గుడివాడలో కొడాలికి టీడీపీ చెక్ పెట్టలేక చేతులెత్తేస్తుంది…ఇక వచ్చే ఎన్నికల్లో కూడా తనని ఓడించలేరని కొడాలి నాని అంటున్నారు. కాస్త పరుష పదజాలంతోనే తనని ఏం పీకలేరని చెబుతున్నారు.

వాస్తవానికి చెప్పాలంటే గుడివాడలో కొడాలిని ఓడించడం అనేది సాధ్యమైన పని కాదు…ఆయనకు రూట్ లెవెల్ లో బలం ఉంది…ఆ బలాన్ని దాటి టీడీపీ గెలుపు అనేది చాలా కష్టం. కాకపోతే గుడివాడలో టీడీపీకి కూడా క్షేత్ర స్థాయిలో బలం ఉంది…కానీ ఆ బలం నానిని ఓడించడానికి సరిపోవడం లేదు. అయితే ఈ సారి బలం పెంచుకుని నానికి చెక్ పెట్టాలని టీడీపీ చూస్తుంది.

తమ అధినేత చంద్రబాబుని పదే పదే తిడుతున్న నానీని ఎలాగైనా ఓడించాలనే కసితో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే సింగిల్ గా నానీని ఓడించడం టీడీపీకి సాధ్యమయ్యే పని కాదు. ఒకవేళ నెక్స్ట్ జనసేనతో గాని పొత్తు ఉంటే…కాస్త టీడీపీకి ప్లస్ అవుతుంది. గత రెండు ఎన్నికల్లో గుడివాడలో జనసేన పోటీ చేయలేదు…అదే నానికి పెద్ద ప్లస్ అయిందని జనసేన శ్రేణులు అంటున్నాయి…ఈ సారి మాత్రం నానికి చెక్ పెట్టాలని పవన్ కూడా చూస్తున్నారని, కాకపోతే సింగిల్ గా నానికి చెక్ పెట్టే సత్తా జనసేనకు లేదు.

కాబట్టి టీడీపీతో గాని, జనసేన కలిస్తే నానికి గట్టి పోటీ ఇవ్వొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇదే క్రమంలో ఈ మధ్య గుడివాడలో జనసేన కూడా బలం పెంచుకునే కార్యక్రమాలు చేస్తుంది…వైసీపీలో ఉన్న కీలక నేతలని జనసేనలోకి తీసుకొస్తుంది. అటు టీడీపీ కూడా వైసీపీపై వ్యతిరేకత ఉన్నవారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది..ఇలా రెండు పార్టీలు బలం పెంచుకుని, కలిసి పోటీ చేస్తే నానీని ఢీ కొట్టవచ్చు..అయిన నానికి చెక్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు..ప్రజా మద్ధతు ఎక్కువ ఉన్న నానీని టీడీపీ-జనసేన కలిసి ఓడించగలవో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version