2024లో నిలదొక్కుకుంటాం.. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్ కళ్యాణ్

-

2014 లో సూటిగా ప్రశ్నించాం ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం…2019లో బలంగా పోరాటం చేశాం బరిలో నిలబడ్డాం.. 2024లో గట్టిగా నిదొక్కకుంటాం… ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాన్. మనం చేస్తున్నది స్వకార్యం కాదని.. ప్రజాకార్యం అది రామకార్యంతో సమానం అని  అన్నారు. జనసేన కార్యకర్తలు సీఎం, సీఎం అని అరవడంతో దానికి ఇంకా టైమ్ ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించాడు. రెండున్నరేళ్ల వైసీప పాలన గురించి మాట్లాడేటప్పుడు.. నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు, ఒకొక్కరు నా ముందు తొడగొడుతున్నారని.. దాన్ని చూస్తే కోపం రాదని, నవ్వొస్తుందని పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు.

Janasena Chief Pawan Kalyan

నేను పూర్తిగా మాట్లాడక ముందే కొంతమంది మంత్రులు విమర్శిస్తున్నారని.. వెల్లుల్లి, వెల్లంపల్లి, బంతి, చామంతి, అవంతి అంటూ పరోక్షంగా కొంత మంత్రులను విమర్శించారు. నాకు వైసీపీ నాయకత్వంపై, మంత్రులపై వ్యక్తిగత విభేదాలు ఏం లేవని.. కేవలం పాలసీలపైనే విబేధిస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా… మంచికార్యంతో మొదలుపెడతారని..మీరు మాత్రం కూల్చివేతతో మొదలుపెట్టారని విమర్శించారు. ఒక్క ఇసుక పాలసీతో భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version