పవన్ తన ఫాన్స్ కి బుద్ధి చెప్పాల్సిన టైమ్ ఇది !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరోనా వైరస్ కట్టడి చేయడంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితీరు చాలా అద్భుతం అని చాలామంది అంటున్నారు. జాతీయ మీడియా ఛానల్ కూడా జగన్ ఐడియా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఇదే టైమ్ లో కేరళ ప్రభుత్వం కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని తాజాగా రెండున్నర లక్షల మందిని గ్రామ వాలంటీర్ లను రిక్రూట్ చేయడానికి రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరులో ఈ విధంగా వ్యవహరిస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.గోనే సంచులు మోసే ఉద్యోగమని హేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కి ఈ టైం లో అయినా బుద్ధి చెప్పాలి అని సోషల్ మీడియాలో సామాన్య నెటిజన్లు కోరుతున్నారు. గ్రామ వాలంటీర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పగడ్బందీగా ఎక్కడికక్కడ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు.

 

ప్రజలను చైతన్య పరుస్తూ ఇంటికే పరిమితం చేస్తున్నారు…అంతే కాకుండా ఇంటి చుట్టుప్రక్కల శుభ్రత లేకపోతే…వాళ్లే వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేస్తున్నారు…అటువంటి గ్రామ వాలంటీర్ల వ్యవస్థపై ఇంగిత జ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్ చేయటం మంచిది కాదని తెలియజేస్తున్నారు. అప్పట్లో ఈ విధంగానే ఎన్నికల టైంలో అతిగా ప్రతిస్పందించడం వల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగిందని…ఇది పవన్ కళ్యాణ్ తన అభిమానులకు బుద్ధి చెప్పాల్సిన టైం అంటూ సామాన్య నెటిజన్లు సోషల్ మీడియాలో కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version