2014 ఎన్నికల్లో కింగ్ మేకర్ అవుతాను, జనసేనకి 40 సీట్లు పక్కా, కర్ణాటకలో సీన్ ఏపీలో కూడా రిపీట్ అవ్వుద్ది అంటూ జనసైనికులని ఉర్రూతలూగించి, పూనకాలు వచ్చేలా చేసిన పవన్ కళ్యాణ్ చివరికి తుస్సుమనిపించాడు. ఊహించ స్థాయిలో సగం సీట్లు కూడా రాలేదు సరికదా ఒక్క సీటుతో సర్దిపెట్టుకుని , తాను పోటీ చేసిన రెండు స్థానాలో ఓడిపోయి రికార్డ్ సృష్టించాడు.దాంతో పవన్ కళ్యాణ్ ముఖచిత్రం మారిపోయింది. ప్రస్తుతం జనసైనికులలో, నేతల్లో ధైర్యాన్ని నింపడానికి పడరాని పాట్లు పడుతున్నాడు.
పవన్ కళ్యాణ్ తాజాగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ తాను విలువలతో రాజకీయాల్లోకి వచ్చానని, 2014 లో టీడీపీ ని అధికారంలోకి తెచ్చానని, యువకుడిగా ఉన్నప్పుడు యోగా సాధన కోసం ఎక్కడికో వెళ్ళిపోయానని, ఎన్నో సవాళ్లు, కష్టాలు ఎదుర్కున్నాని, అందుకే ఓడిపోయినందుకు బాధపడలేని మరింతగా గెలుపుకోసం కష్టపడుతానని అన్నాడు. అయితే నేతలు అర్థం చేసుకోవడానికే నేను పదేపదే ఈ విషయాలు చెప్తున్నానని పవన్ ప్రకటించారు. ఇక్కడ ఒక విషయాని పరిశీలిస్తే..
జనసేనలో తాజా రాజకీయ పరిస్థితులు పవన్ వ్యాఖ్యలతో స్పష్టంగా అర్థం అవుతాయి. ప్రస్తుతం పవన్ కి జనసేన నేతలకి మధ్య గ్యాప్ వచ్చింది అనడానికి ఇదే నిదర్సనం అంటున్నారు విశ్లేషకులు. ఇన్నేళ్ళు గడుస్తున్నా సరే పవన్ ని తన నేతలు అర్థం చేసుకోలేకపోవడంలో మర్మం ఏమిటో అంతు చిక్కడంలేదు. గతంలో ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ ఈ విధంగా కామెంట్స్ చేసిన దాఖలాలు లేవు. కానీ ఓటమి చెందిన తరువాత మొట్టమొదటి సారిగా పవన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే పార్టీ నుంచీ కీలక నేతలు జారిపోతున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.
అందుకే పవన్ వారిని నిలువరించడానికి సొంత డబ్బాలు కొట్టుకుంటున్నాడని అంటున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల సంచారం ప్రకారం త్వరలోనే కొందరు నేతలు జనసేన పార్టీ నుంచీ మెల్లగా జారుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఇది పుకార్ల వరకే పరిమితం అవుతుందా లేదా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.