పవన్ సడన్ ట్విస్ట్.. బాబు రివర్స్ ట్విస్ట్ రెడీ?

0
103

ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు..సడన్ గా పొత్తులపై ఊహించని కామెంట్ చేశారు…తనకు ప్రజలతోనే పొత్తు తప్ప…ఎవరితోనూ లేదని తేల్చి చెప్పేశారు. అసలు ఇటీవలే పొత్తుకు సంబంధించి మూడు ఆప్షన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే…ఒకటి..బీజేపీ-జనసేన కలిసి పోటీ చేయడం..రెండోది…టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేయడం…మూడోది…జనసేన సింగిల్ గా పోటీ చేయడం అని చెప్పారు.

అయితే ఇప్పటివరకు పొత్తుల విషయంలో తాము తగ్గుతూ వచ్చామని, ఈ సారి టీడీపీ తగ్గాలని అన్నట్లు మాట్లాడారు. ఇక పవన్ పొత్తు వ్యాఖ్యలపై టీడీపీ వెంటనే స్పందిస్తూ..తమకు ఇబ్బంది లేని వరకు తగ్గుతామని, అంతకుమించి తాము తగ్గమని, అలాగే పవన్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన చేసే డిమాండ్ ని అసలు ఒప్పుకునే ప్రసక్తి లేదని అవసరమైతే సింగిల్ గా పోటీ చేస్తామని టీడీపీ వాళ్ళు చెప్పేశారు. అలాగే టీడీపీ అనుకూల మీడియా కూడా టీడీపీ ఒంటరిగానే పోటీ చేయాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయని కథనాలు కూడా వేసింది.

ఇదే క్రమంలో తాజాగా పవన్…ప్రజలతోనే పొత్తు ఉంటుందని కామెంట్ చేశారు..అంటే టీడీపీతో పొత్తు ఉండదని పరోక్షంగా చెప్పారు. మరి టీడీపీ నేతల మాటలు చూసి…పవన్ కలవాలని ఇలా ట్విస్ట్ ఇచ్చారా? లేక పొత్తు గురించి అప్పుడే వైసీపీకి తెలియకూడదని చెప్పి…ఇలా మాట్లాడారా? లేదంటే టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపీ చేసే రాజకీయానికి పవన్ తలొగ్గారా? అనేది తెలియడం లేదు.

మొత్తానికైతే పొత్తు ఉండదనే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి..ఈ క్రమంలో చంద్రబాబు పొత్తు గురించి ఎలా మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన పూర్తిగా పొత్తు గురించి మాట్లాడటం తగ్గించేశారు. మొదట టీడీపీని బలోపేతం చేయడంపైనే ఆయన దృష్టి పెట్టారు. ఇక తమ నాయకుల చేత…సింగిల్ గా పోటీ చేసి సత్తా చాటుతామని చెప్పించి..పవన్ కు రివర్స్ ట్విస్ట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తు గురించి కొట్టుకుంటూ…చివరికి వైసీపీకి ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాయి