శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం బయటకు తెలియడంలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తుపానుతో నష్టపోయిన శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి తనకు కన్నీళ్లొచ్చాయని తెలిపారు. తాను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదని.. ఆవేదనను తన గుండెల్లోనే పెట్టుకున్నానని చెప్పారు. బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా భావనపాడులో పర్యటించారు. సిక్కోలు ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పెను తుపాను తిత్లీ బాధితుల కష్టాలను తెలుసుకొనేందుకు మూడు రోజులు శ్రీకాకుళం జిల్లాలోనే పర్యటించనున్నట్టు చెప్పారు. తుపానుతో జరిగిన నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ప్రజలను కొందరు అధికారులు బెదిరిస్తున్నారని, ఎవరైనా ప్రజల్ని బెదిరిస్తే తోలు తీస్తానని పవన్ హెచ్చరించారు.