విజయవాడ: టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు దంపతులు సహా 9 మందిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు తయారీ, బెదిరింపులకు పాల్పడుతున్నట్టు రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి నగర సీపీకి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. పిర్యాదును స్వీకరించి, విచారణ జరిపిన న్యాయస్థానం ఫిర్యాదులో పేర్కొన్న విధంగా ఎమ్మెల్యే బోండా ఉమా సహా 9 మందిపై చర్యలు చేపట్టాలని బెజవాడ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అజిత్‌నగర్ సమీపంలో స్వాతంత్ర సమరయోధుల కోసం కేటాయించిన 5 ఎకరాల భూమిని రామిరెడ్డి కోటేశ్వరరావు అనే వ్యక్తి సంతకాలను ఫోర్జరీ చేసి కొన్నట్లు చూపించి, తిరిగి దాన్నే బోండా ఉమామహేశ్వరరావు భార్య సుజాత కొన్నట్లు బాధితులు బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఈ కేసును పోలీసులు నీరుకార్చడానికి ప్రయత్నించారు. బోండా ఉమాపై చర్యలు తీసుకోవడంలో ప్రేక్షక పాత్ర పోషించారు. దీంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు.