వైసీపీని టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ బయలుదేరిన పవన్ కల్యాణ్..

-

రాజధానిని అమరావతి నుండి కదలనివ్వను అంటూ రైతులకు హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఢిల్లీకి బయలుదేరారు. కేంద్రం నుంచి తనకు పిలుపు వచ్చిందని, ఢిల్లీ వెళ్తున్నానని పవన్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. వైసీపీ వినాశనానికి రాజధాని మార్పు నాంది పలికిందన్నారు. అమరావతి ఇక్కడే ఉండాలి.. ఇదే తాను కేంద్రాన్ని కోరేదని పవన్ స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇక ఆయనతో పాటు పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన పవన్ కాసేపట్లో ఢిల్లీ చేరుకుని బీజేపీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం వరకు వారు అక్కడే ఉంటారు. ఏపీలో మూడు రాజధానుల అంశాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ నేతలతో చర్చించేందుకు పవన్ వెళ్లారు. రాజధాని అంశంపై బీజేపీతో కలిసి పోరాడడానికి జనసేన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version