వైసిపి పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాల పైన నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. అవేంటంటే… “మొదటి రత్నం”: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. మూడేళ్లలో మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం ఏడు వందల మందికి ఆర్థిక సహాయాన్ని పరిమితం చేయలేదా?.. “రెండవ రత్నం”: అమ్మ ఒడి, అమ్మ బడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు?..
” మూడవ రత్నం”: పెన్షన్లు, పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?..”నాలుగవ రత్నం”: సంపూర్ణ మద్యపాన నిషేధం, మద్యపాన ఆదాయం 2018- 19 లో రూ14 వేల కోట్లు.. 2021- 22 లో రూ. 22 వేల కోట్లు ఇదేనా మద్య విధం? ఈ ఆదాయం చూపించే రూ. 8 వేల కోట్ల బాండ్లు అమ్మ లేదా..ఐదవ రత్నం: జలయజ్ఞం, పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?..ఆరవ రత్నం: ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాయి? అంటూ ఇలా తొమ్మిది రత్నాలు పై 9 ప్రశ్నలు సంధించారు.