ఈ నెల 14న తెలంగాణలో జనసేన పార్టీ అధినే పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. నల్గొండ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నెల 14న హుజూర్నగర్, చౌటుప్పల్ నియోజకవర్గాలలో చనిపోయిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.
ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తెలంగాణ జనసేన పార్టీ శ్రేణులు. అయితే.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్… కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తారా అనే సందేహం అందరిలోనూ ఉంది.
ఇది ఇలా ఉండగా…అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని.. రైతాంగానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో నెలకొన్న అసని తుపాను ప్రభావం కోస్తా జిల్లాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని… ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని వెల్లడించారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని.. వరి పంట కోత కోసే సమయంలో ఈ విపత్తు రావడం దురదృష్టకరమని ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.