జగన్ రివెంజ్ పాలిటిక్స్ పై.. పవన్ సంచలన ట్వీట్లు..?

-

ఏపీ సీఎం జగన్ అంటే చాలు ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనికితోడు ఇటీవల జగన్ రెడ్డి- పవన్ నాయుడు అంటూ రెండు పార్టీల నేతల మధ్య కులాల వివాదం కూడా హీట్ పెంచేసింది. జగన్ సర్కారుపై కేంద్రం పెద్దలకు కంప్లయింట్ చేస్తానంటూ ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్.. అక్కడ ఎవరిని కలిశారో తెలియదు కానీ.. సంచలన ట్వీట్లతో హీట్ మరికాస్త పెంచుతున్నారు.

కొన్నిరోజులుగా పవన్ కల్యాణ్ ఇంగ్లీషు, ఇసుక అంశాలపై పోరు పెంచారు. తాజాగా ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి నుంచి ట్విట్టర్ లో ఓ సంచలన పోస్టు పెట్టారు. ఢిల్లీలో ఇలా అనుకుంటున్నారు అంటూ వైఎస్ జగన్ ది రివెంజ్ పాలిటిక్స్ అని విమర్శించారు. జగన్‌ పరిపాలన పగతీర్చుకునే విధంగా, సరైన కొలమానం లేకుండా సాగుతోందని ఆ ట్వీట్లలో మండిపడ్డారు. అంతే కాదు.. వైసీపీ ప్రభుత్వ పాలనపై ఇంగ్లిష్‌ పత్రికల్లో వచ్చిన ఆర్టీకల్స్ ను తన పోస్టుకు అటాచ్ చేశారు.

ఆ ఇంగ్లీష్ ఆర్టికల్స్ ప్రజలకు అర్థమవుతాయో లేదోనని వాటిని అనువాదం చేసి మరీ అందించారు పవన్ కల్యాణ్.. జగన్‌రెడ్డి పరిపాలన భయాందోళన కలిగిస్తోందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ముద్ర లేకుండా చేయాలని బాహాటంగానే చేపడుతున్న వరుస చర్యల్లో భాగంగా రాజధాని అమరావతిలో 6.84 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ స్టార్టప్‌ కోసం సింగపూర్‌ కన్సార్షియంతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నారని ఆ పత్రికలు రాశాయి. అమరావతి స్టార్టప్‌ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్లే అండ్‌ ప్లగ్‌ కార్యాలయాల ఏర్పాటు పూర్తయి ఉంటే 50 వేల ఉద్యోగాలు లభించేవవని.. జగన్‌ ప్రభుత్వానికి చంద్రబాబు కోరుకున్న రీతిలో ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం ఇష్టం లేని నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు రద్దు నిర్ణయాన్ని చూడాలని ఆ పత్రికలు తెలిపాయి.

అమరావతిలో స్టార్టప్‌ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, వర్తమాన భారతదేశానికి అత్యావశ్యకమైన పట్టణాభివృద్ధికి పెద్ద విఘాతమంటూ మరో పత్రిక రాసిన ఆర్టికల్స్ కూడా పవన్ అటాచ్ చేశారు. జగన్ నిర్ణయం భారత్‌లోని విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బ తీసిందని… రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్‌ వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని ఆ పత్రిక అభిప్రాయపడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version