మీ రేషన్ కార్డు దేశంలో ఎక్కడైనా పని చేస్తుంది…!

-

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ని ప్రవేశ పెట్టె దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది.. ప్రధానిగా నరేంద్ర మోడీ… బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశంలో అనేక పథకాలకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే.

సరికొత్త మార్పు దిశగా ఆయన తీసుకునే నిర్ణయాలు దేశాన్ని నడిపిస్తున్నాయి. నోట్ల రద్దు జీఎస్టీ నిర్ణయాలు ఒక సంచలనం అనే చెప్పాలి. వాటి వలన కలిగిన ప్రయోజనాలను పక్కన పెడితే అవి మాత్రం ప్రజల్లో ఆయన సాహసవంతుడిగా మార్చాయి అనేది వాస్తవం. ఇక ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నిక అనే నినాదంతో మోడీ సర్కార్ దూసుకుపోతుంది.

ఈ నేపథ్యంలో… మరో సంచలన నిర్ణయం దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తుంది. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు’ అనే ఆలోచనతో సర్కార్ సరికొత్త ప్రయత్నాలు చేస్తుంది. అసలు దీని వెనుక ఉన్న అసలు ముఖ్య ఉద్దేశం ఏంటీ అనేది కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మాటల్లో చూస్తే… “ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 కింద రేషన్ కార్డు కలిగిన వాళ్లందరూ దేశంలోని ఏ రేషన్ షాప్ నుంచైనా సబ్సిడీ ద్వారా నిత్యావసర వస్తువులను తీసుకోవచ్చు.

ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల రేషన్ కార్డు వినియోగదారులు తమకు నిర్దేశించిన రేషన్ షాపుల నుంచే సబ్సిడీ సామాగ్రిని పొందవలసి ఉంది. ఇక ఇప్పుడు ప్రతిపాదించిన విధానం వల్ల వినియోగదారుడు తమ సొంత ఊరు నుంచి.. వేరే ప్రదేశానికి వెళ్లినా.. అక్కడి రేషన్ షాప్ ద్వారా ఆహారం తీసుకునే సదుపాయం ఉంటుంది.” అని ఆయన వివరించారు. దీనిపై పలువురు ప్రసంశలు కురిపిస్తున్నారు. సంచార జాతుల వారు, రేషన్ కార్డు లేక ప్రభుత్వం నుంచి వచ్చేవి కోల్పోతున్నారని… ఈ పథకం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version