నరేష్ విషయంలో ట్రోల్ అవుతున్న పవన్..!!

-

మాజీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్.. ప్రముఖ నటుడు అయిన నరేష్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో పవిత్ర లోకేష్ వ్యవహారంలో బాగా వైరల్ గా మారుతున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వీరిద్దరి పేర్లు మారుమ్రోగుతున్నాయి. వీరిద్దరికీ ఏదో సంబంధం ఉన్నట్లుగా వార్తలపై నరేష్ మూడవ భార్య స్పందించడం కూడా జరిగింది. ఈ వ్యవహారం గత రెండు రోజుల నుంచి చాలా పెద్దదిగా మారిపోయింది. ఈ వ్యవహారం వల్ల నరేష్ సినిమాల ద్వారా సంపాదించుకున్న పరువు మొత్తం పోయేలా కనిపిస్తోంది.

ఈ విషయంలో అసలు తప్పు ఎవరిది అనే విషయం పక్కన పెడితే అభిమానులకు నరేష్ పై ఉన్న అభిమానం కూడా చేజారిపోయినట్లూ కనిపిస్తోంది. నటుడు నరేష్ తన వ్యక్తిత్వం గురించి చాలా చెప్పుకుంటూనే ఇంత మంది భార్యలను మార్చే ప్రక్రియలో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఇలా ఉండగా సినీ హీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నరేష్ వ్యక్తిత్వం గురించి గొప్పగా పొగడ్తలు కురిపించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ అవుతోంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ హీరో నాని నటించిన అంటే సుందరానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. ఇందులో నరేష్ గురించి మాట్లాడుతూ నరేష్ అంటే తనకి చాలా ఇష్టమని. అంతే కాకుండా గౌరవం అని ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని పొగిడేశారు.. అయితే వీరిద్దరూ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే పరిచయం ఉన్నది చెన్నైలో కూడా వీరిద్దరూ పక్కపక్కనే ఉండే వాళ్లని సమాచారం. కానీ నరేష్ ముగ్గురు భార్యలు వ్యవహారం ప్రస్తుతం రచ్చకెక్కడంతో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిత్వాన్ని పొగుడుతూ మాట్లాడిన మాటలపై ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్. దీంతో కొంతమంది నేటిజన్స్ ఇద్దరు సరిపోయారు భార్యల విషయంలో సేమ్ టు సేమ్ అనే విధంగా ట్రోల్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version