ఇందిరమ్మ ఇళ్లకు ఆశపడిన ప్రజలు ప్రభుత్వం తరఫున సాయం వస్తుందని ముందస్తుగానే తమ ఇళ్లను కూల్చుకున్నారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ గ్రామాన్ని ప్రభుత్వం పైలట్ గ్రామంగా ఎంపిక చేసి, కొందరు లబ్దిదారులను స్టేజి మీదకు పిలిచి అధికారులు ఇందిరమ్మ ఇళ్లు పత్రాలను అందజేశారు.
అయితే, ఖాళీ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు వస్తాయని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు తాము ఉంటున్న ఇళ్లను కూల్చేసినట్లు తెలిసింది. తీరా ఇప్పుడు వారి పేర్లు రెండో లిస్ట్‌లో, మూడో లిస్టులో వస్తాయని చెప్పడంతో పాటు డబ్బులు కూడా అప్పుడే వస్తాయని అధికారులు మాట మార్చారు. కాగా, ఇల్లు మంజూరు చేస్తామంటే ఉన్న ఇల్లు కూల్చేసామని, కిరాయి ఇంట్లో ఉంటున్న తమకు న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కోసం ఉన్న ఇల్లు కూలిస్తే నట్టేట ముంచిన ప్రభుత్వం
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి, కొందరు లబ్దిదారులను స్టేజి మీదకు పిలిచి అధికారులు ఇందిరమ్మ ఇల్లు పత్రాలు అందించారు
ఖాళీ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు డబ్బులు వస్తాయంటే లబ్ధిదారులు తాము… pic.twitter.com/EtzIZzqeLj
— Telugu Scribe (@TeluguScribe) March 6, 2025