హర్యానాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తొలుత కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ప్రచారం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో కొనసాగింది. మధ్యాహ్నం తరువాత ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయి. బీజేపీ 49 స్థానాల్లో ముందంజలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ 36 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.
7 గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హరియానా ప్రజలు తిరస్కరించారని.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు ఆ పార్టీని వెంటాడాయని తెలిపారు కేటీఆర్. కొందరిని కొంతకాలం నమ్మించ వచ్చేమో కానీ.. అందరినీ ఎల్లకాలం కాంగ్రెస్ మోసం చేయలేదని హర్యానా ఫలితాలతో తేలిపోయింది. అబద్ధాల పునాదులపై రాజకీయం చేసే కాంగ్రెస్ కు ఓటర్లు కర్రుకాల్చి వాతపెట్టారు. బీజేపీని ఢీ కొనే సత్తా ప్రాంతీయ పార్టీలకు తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదని మరోసారి స్పష్టమైంది. 2029 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు లో బలమైన ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర ఉంటుందని తెలిపారు కేటీఆర్.