సమ్మక సారక్క దర్శనాలకు అనుమతి…!

-

కరోనా వైరస్ కారణంగా మన దేశంలో దేవాలయాల విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. దేవాలయాల్లో భక్తులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ దేవాలయాల్లో మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో… దర్శనాలను ప్రముఖ దేవాలయాల్లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. సమ్మక్క సారక్క దర్శనాలను కూడా నిలిపివేశారు.

మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించిన పూజారులు… దర్శనాలను నిలిపివేశారు. ఇవాళ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి దర్శనాలకు అనుమతి ఇచ్చారు. దీనిపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు అనుమతి ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version