పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ ఊసరవెళ్లి అని.. నిన్నటి సభలో భీమ్లా నాయక్ సినిమా డైలాగులే చెప్పారని నిప్పులు చెరిగారు మంత్రి పేర్ని నాని. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ద్వేషించడం పవన్ కళ్యాణ్ ముఖ్య సిద్ధాంతమని ఫైర్ అయ్యారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని పవన్ ఎందుకు ప్రశ్నించలేదు అని నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ మరియు బిజెపి పార్టీ ని కలిపి ఉంచి ఎందుకు పవన్ తాపత్రయ పడుతున్నారు అని చురకలంటించారు. విశాఖ ఉక్కు నమ్మవద్దని ఢిల్లీ వాళ్ళను నిలదీయ లేరా అని ప్రశ్నించారు. వెల్లుల్లి పాయ వెల్లంపల్లి, చామంతి.. అవంతి అని తిడుతూ.. మీరు మాత్రం మానసికి అత్యాచారం చేయొచ్చు కానీ.. మేము మాత్రం మిమ్మల్ని ఏమన కూడదా.. మీకు ఒక్కడికే మనసు ఉంటుందా..? అని ప్రశ్నించారు. 2014-19 వరకు మీ వల్ల ఏం ప్రయోజనం జరిగిందని ప్రశ్నించారు. మీరు ఉద్ధానం వెళ్లి ఏం చేశారు అని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మన పార్టీలోకి దూకుతారో.. అని టీడీపీ కార్యకర్తలు చూస్తున్నారని పేర్ని విమర్శించారు.