గుడివాడ కేసీనో అంటూ టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అంశంపై స్పందించారు మంత్రి పేర్ని నాని. నిజంగా తప్పు చేసి ఉంటే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎవరి పైనా అయినా చర్యలు తీసుకుంటారన్నారు మంత్రి పేర్ని నాని. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం ఎవరికీ చుట్టం కాదని పేర్కొన్నారు.
మా ఎమ్మెల్యే అయినా కేసు పెట్టి సీఎం జగన్ మోహన్ రెడ్డి లోపల వేయమంటారని.. ఇది చంద్రబాబు ప్రభుత్వం కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై కావాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పేర్ని నాని.
ఇక అంతకు ముందకు కే కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో పెట్టానని నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని… నిరూపించలేకపోతే టీడీపీ, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారని సవాల్ విసిరారు కొడాలి నాని.చంద్రబాబు టైం అయిపోయిందని.. ప్రజల్ని వేధించిన వారిని, ప్రజల్లో గెలుపొందలేని వారిని తీసుకువచ్చి నిజనిర్థారణ కమిటీని ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. బ