టిటిడి పాలక మండలి : సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు !

-

టిటిడి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం పై దుమారం చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే.. ప్రత్యేక ఆహ్వానితుల నియామకం పై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా ఈ వ్యవహారం పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. టిటిడి బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వ్యవహారంలో సుప్రీంకోర్టు లో మాదినేని ఉమామహేశ్వరరావు కెవియట్ దాఖలు చేశారు.

supreme-court

మాదినేని తరపున న్యాయవాది బాలాజీ కెవియట్ దాఖలు చేశారు. టిటిడిలో బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం పై ఈనెల 15న జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా… తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జిఓ ను సస్పెండ్ చేస్తూ.. ఈనెల 22న ఆదేశాలు ఇచ్చింది ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని డివిజన్ బెంచ్.

టిటిడి బోర్డులో 50మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఓపై అమరావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాదినేని… హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు అయితే… తమ వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు లో కెవియట్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version